మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇంట్లో సీబీఐ సోదాలు

301
Srujana Chowdari
- Advertisement -

కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన మరో సంస్ధ బెంగళూరు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించనందుకు కంపెనీపై కేసు నమోదు చేశారుఅధికారులు  . ఆ కేసుకు సంబంధించి బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీమ్ సోదాలు నిర్వహిస్తుంది.

దాదాపు రూ.360 కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలుస్తుంది. కంపెనీ ఎండీతో పాటు డ్రైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో, శ్రీనగర్ కాలనీలోని సుజనా చౌదరి నివాసంలో, జూబ్లిహిల్స్, పంజాగుట్టలోని కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. మరో వైపు సుజనా చౌదరిని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయనపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -