చిక్కుల్లో చిదంబరం..14 మందిపై చార్జిషీట్

603
chidambaram
- Advertisement -

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో చిదంబరం పేరును సీబీఐ చార్జిషీటులో చేర్చింది. చిదంబరంతో పాటు కార్తీ చిదంబరం,పీటర్ ముఖర్జీ,ఇంద్రాణి ముఖర్జీ సహా 14 మంది పేర్లను దాఖలు చేసింది ఈ మేరకు చార్జిషీటును ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించగా ఈనెల 21న కోర్టు విచారణ చేపట్టనుంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయగా అప్పటి నుంచి ఆయన అప్పీలు చేసుకున్న బెయిల్ పిటిషన్స్ అన్ని తిరుస్కరణకు గురయ్యాయి. దీంతో తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు చిదంబరం.

నిందితుడు ఎవరైనా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు రెండు నెలల్లోగా చార్జిషీటు దాఖలు చేయకుంటే సదరు వ్యక్తి బెయిలు పొందే అవకాశం ఉటుంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడంతో చిదంబరం చిక్కుల్లో పడ్డారు.

- Advertisement -