- Advertisement -
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతుగా మారారు. పొలంబాట పట్టి సేద్యం చేశారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ఆయన….తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఏరువాక సాగించారు.
కౌలుకు తీసుకున్న భూమిలో ట్రాక్టర్‌తో తానే స్వయంగా దుక్కి దున్నారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి కౌలు రైతులు, యువతుల సమస్యలపై దృష్టి సారించానని జేడీ చెప్పారు. జేడీ పొలాన్ని కౌలుకు తీసుకోని వ్యవసాయం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -