రూలర్ బాలయ్యతో ఎమ్మెల్యే రొమాన్స్‌..!

583
catherine
- Advertisement -

ఇద్దరమ్మాయిలతో’ .. ‘సరైనోడు’.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కేథరిన్. సరైనోడులో ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ,మలయాళ ,కన్నడ సినిమాల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

తాజాగా బాలయ్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కేథరిన్. ప్రస్తుతం రూలర్ సినిమా చేస్తున్న బాలయ్య ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు సోనాక్షి సిన్హా,కేథరిన్ నటించనున్నారు.

బాలయ్యతో మూవీ కోసం కేథరిన్‌ను సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పింది. బోయపాటితో కేథరిన్‌కు ఇది తొలి సినిమా కాగా బాలకృష్ణతో మొదటిది. ఇక ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ పెంచేసిందట ఈ బ్యూటీ. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -