సినిమా థియేటర్‌లో యాడ్స్‌.. కేసు నమోదు!

14
- Advertisement -

సినిమా థియేటర్‌లో యాడ్స్ వేశారని పీవీఆర్ ఐనాక్స్, బుక్ మై షోపై కేసు నమోదైంది. షోకి ముందు అరగంట పాటు యాడ్స్ వేసి తన సమయం వృధా చేశారని కేసు వేశారు బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే వ్యక్తి.

2023లో బెంగళూరులో ఓ పీవీఆర్ ఐనాక్స్‌లో సినిమాకు వెళ్లారు అభిషేక్. యాడ్స్ కారణంగా అరగంట షో ఆలస్యం అయింది. ఈ కారణంగా తన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నానని పీవీఆర్ ఐనాక్స్, బుక్ మై షోపై కేసు నమోదు చేశారు.

దీంతో ఈ కేసులో తీర్పునిచ్చిన న్యాయస్థానం.. ఆ వ్యక్తికి రూ.65,000 చెల్లించాలని, అలాగే రూ.1,00,000 జరిమానా కట్టాలని వెల్లడించింది. సమయం వృధా కేసులో బుక్ మై షోకి సంబంధం లేదని మినహాయింపు ఇచ్చింది.

Also Read:సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్

- Advertisement -