వకీల్‌సాబ్ సినిమాపై కేసు నమోదు..!

121
vakeel saab movie
- Advertisement -

ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ సినిమా సూపర్‌ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంపై సుధాకర్ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సినిమాలోని ఓ సన్నివేశంలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబరును వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నటిని అసభ్యకరంగా మార్చినట్టు ఉన్న ఫొటోల కింద తన ఫోన్ నంబరు ఉందని, దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రోజూ ఫోన్లు వస్తున్నాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫోన్ చేసిన వారు తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. తన ఫోన్ నంబరును వాడుకున్నందుకు సినిమా యూనిట్‌పై కేసు నమోదు చేయాలని కోరాడు. పోలీసులు కేసు ఫైల్‌ చేసినట్లుగా సమాచారం.

- Advertisement -