ప్రముఖ రచయిత కోన వెంకట్ పై కేసు నమోదు

403
Kona-Venkat
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమాకు కథ ఇస్తానని చెప్పి నగదు తీసుకుని మోసం చేశారంటూ జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కథ ఇవ్వకపోగా, డబ్బు సైతం తిరిగి ఇవ్వకుండా తమనే బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కోన వెంకట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవాళ కోన వెంకట్ కు నోటిసులు ఇవ్వనున్నారు పోలీసులు. ఇక దీనిపై కోన వెంకట్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -