కంచె పై కేసు..

204
case file on Kancha Ilaiah...
- Advertisement -

కంచె ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఐలయ్య తమ సామాజికవర్గాన్ని కించపరుస్తున్నాడని, తన రాతలతో, మాటలతో విధ్వేషపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆర్యవైశ్య సంఘాలు ఆందోళనలు చేస్తూ, ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు స్పందించారు.

ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను మంగళవారం ఆదేశాలు ఇచ్చారు.

TRS Leaders Fire on Prof Kancha Ilaiah

‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకంతో ఐలయ్య వివాదం రేపారు. వైశ్య సామాజికవర్గీయులను స్మగ్లర్లుగా పోల్చడం పట్ల విమర్శలు వచ్చినా.. ఐలయ్య  మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తన పుస్తకంలోని అంశాలను ఆయన సమర్థిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సంఘాలు ఐలయ్యపై మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై ఉభయ తెలుగురాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ఐలయ్యపై కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు, ఈ పుస్తకాన్ని నిషేధించాలని, ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -