కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

227
konda Vishweshar Reddy
- Advertisement -

కాంగ్రెస్ నేత, చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుక్కున్నారు. ఇటివలే ఎన్నికల సమయంలో అతని బంధువు కొండా సందీప్ దగ్గర రూ.10లక్షల నగదు పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో తాజాగా ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల సమయంలో డబ్బులతో పట్టుబడ్డ అతని బంధువుకు నోటిసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తమపై దాడికి పాల్పడినట్టు బంజారాహిల్స్ ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. నోటిసులు ఇవ్వడానికి వెళ్లిన తమను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారని..అంతేకాకుండా గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల ఇచ్చిన ఫిర్యాదుతో కొండాపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా సందీప్ రెడ్డి అనే వ్యక్తి రూ.10 లక్షలతో పట్టుబడ్డాడు. ఆ డబ్బులకు సంబంధించి అతడి వద్ద ఎలాంటి పత్రాలు, రశీదులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సందీప్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సందీప్ వద్ద నుంచి కీలక పత్రాలు, లాప్ ట్యాప్ లను కూడా స్వాధినం చేసుకున్నారు పోలీసులు.

- Advertisement -