రాజస్ధాన్ పై పంజాబ్ గెలుపు

137
kxip

మొహాలీ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్ధాన్ రాయల్స్ పై 12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణిత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 183పరుగులు చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ 47బంతుల్లో 52పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ గ్రిస్ గేల్ 22బంతుల్లో 30పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వత వచ్చిన డేవిడ్ మిల్లర్ 27బంతుల్లో 40పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వడంతో 182పరుగులు చేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ రాయల్స్ టీం నిర్ణిత 20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 170పరుగులు మాత్రమే చేసింది. రాజస్ధాన్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 45బంతుల్లో 50పరుగులు చేసి అవుట్ కాగా, బట్లర్ 17బంతుల్లో 23పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ సామ్ సన్27పరుగులు, రహానే 26పరుగులు, బిన్ని 11బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కులకర్ణీ, ఉనద్కట్, సోదీ తలో వికెట్ తీశారు. కెప్టెన్‌గానూ పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌ కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.