హాథ్రస్‌ మృత్యుఘోష..పెరుగుతున్న మృతులు

4
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌ హాథ్రస్ లో విషాదం నెలకొంది. హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 116కి చేరింది. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చివరి రోజు కావడంతో బాబాను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

బోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్‌సింగ్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా పనిచేశారు. 2006లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తన పేరును సూరజ్ పాల్ సింగ్‌ బోలేబాబాగా మార్చుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రబోధం అంటే ఆసక్తి ఉండేది. భోలే బాబా భక్తుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు ప్రముఖ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సత్సంగ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. యూపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. సత్సంగ్ నిర్వాహకులలో ఐదుగురిపై కేసు నమోదు చేయగా ఇందులో భోలేబాబా పేరులేకపోవడం విశేషం.

Also Read:డ్రగ్స్‌పై పోరులో ముందుకురండి:కేతిరెడ్డి

- Advertisement -