హరిత హారం కోసం తపిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

291
etela rajender

దేశ వ్యాప్తంగా హరితహారం కోసం తపిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్. బంజారాహిల్స్ లోని తాజకృష్ణ లో కార్డియోలజీకల్ సొసైటీ ఆఫ్ తెలంగాణ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి ఈటెల రాజెందర్ తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి ఈటెల రాజెందర్ మాట్లాడుతూ.. తెలంగాణరాష్ట్రంలో ఆరోగ్యశాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పల్లెల్లో కనీస సౌకర్యాలు లేని చోటా గర్భిణుల ఆరోగ్యం కోసం గుడ్లు, పాలు అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు కొంత ఆర్ధికంగా అండగా ఉంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేశాము. రోగాలను ముందుగానే గుర్తిస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం సులభం అన్నారు. పేదలకు చౌకగా వైద్యం అందించేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగ పడాలి అన్నారు మంత్రి ఈటెల.

గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా మారిందన్నారు. బిడ్డ గుండె కొట్టుకున్నప్పుడే తల్లి గర్భ సంచి ముఖ్యమైన అవయవంగా ఉంటుంది. సోనాలజిస్ట్ గా ఎన్నో హృదయాల చప్పుడు నేను వినేదాన్ని అని అన్నారు. చాలా మంది యుక్త వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్డియాలజిస్ట్ ల మీద ఉంది. నేఉన డాక్టర్ గా ప్రాక్టీస్ చేసే సమయంలో ఒక రోగి బాధగా ఉండటం చూసి అడిగితే నేను వ్యాధి గురించి భయపడటం లేదు ఖర్చు గురించి బెంగ పడుతున్న అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు.