మహారాష్ట్రలోని ఠాణే జిల్లా, అంబర్ నాథ్ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనకు కారు డ్రైవర్ గుండెపోటుకు గురికావడమే కారణమని తెలుస్తోంది.
శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో, నియంత్రణ కోల్పోయిన కారు వేగంగా ముందు వెళ్తున్న బైక్‌లపైకి దూసుకెళ్లింది.
ఈ పెను ప్రమాదంలో ఒక బైకర్ గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్తో పాటు మరో ముగ్గురు మరణించారు. అభ్యర్థి కిరణ్ చాబేతో పాటు కారులో ఉన్న మరికొంత మందికి గాయాలయ్యాయి.
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
సీసీటీవీ ఫుటేజ్
డ్రైవర్ గుండెపోటుకు గురవ్వడంతో బైక్‌లపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
మహారాష్ట్ర – ఠాణే జిల్లా అంబర్ నాథ్ ఫ్లైఓవర్‌పై ఘటన
శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ప్రచారం నుండి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురైన కారు డ్రైవర్
దీంతో బైక్… pic.twitter.com/97LkPUwQEy
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2025
Also Read:IND vs SA:చరిత్ర సృష్టించిన పంత్

