స్వామి భక్తి..సెలైన్‌తో కారు క్లీనింగ్!

293
car
- Advertisement -

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ ఆస్పత్రి సిబ్బంది స్వామి భక్తి ప్రదర్శించారు. ఆస్పత్రి మరమ్మత్తుల పనిలో భాగంగా డాక్టర్ కారుపై సున్నం పడిందని ఏకంగా సెలైన్ బాటిల్‌తోనే కారును తుడిచి సార్‌కు కోపం రాకుండా చూశారు. ఇదే వారి కొంప ముంచింది. ఆస్పత్రి సిబ్బంది కారు తడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అత్యవసర సమయాల్లో రోగి ప్రాణాన్ని కాపాడే సెలైన్ ను ప్రభుత్వ ఆస్పత్రులు దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ ను కారు తుడిచేందుకు వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత సిబ్బందిని ఇదేందటని ప్రశ్నించగా సెలైన్ బాటిల్‌లో నీరు పోసి తుడుస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు.

అయితే సెలైన్ బాటిల్ లో నీళ్లు నింపే అవకాశాలు తక్కువని, కావాలనే ఔషధాలను దుర్వినియోగం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -