పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా..

121
amarinder singh
- Advertisement -

త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనుండగా ఎన్నికలకు ముందు ఆసక్తికరణ పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, సీఎం అమరీందర్ సింగ్ మధ్య కొద్దిరోజులుగా వివాదం నడుస్తుండగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

కాసేప‌టి క్రితం పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్‌ను క‌లిశారు. త‌న‌తో పాటు త‌న‌ మంత్రిమండ‌లి రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించారు. ఈ విష‌యాన్ని పంజాబ్ సీఎం మీడియా అడ్వైజ‌ర్ ర‌వీణ్ తుక్రాల్ తెలిపారు. మూడ‌వ సారి త‌న‌ను కాంగ్రెస్ అవ‌మానించిందని…రాజీనామా చేయాల‌ని ఇవాళ ఉద‌య‌మే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు అమరీందర్ సింగ్.

ఎమ్మెల్యేల‌తో మీటింగ్ నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ పార్టీ స‌మాయ‌త్త‌మైన వేళ కెప్టెన్ అమ‌రీంద‌ర్ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -