ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కాన్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2026 వేడుకలకు సర్వం సిద్ధమైంది. మే నెలలో ఫ్రాన్స్ వేదికగా జరగనున్న ఈ వేడుకలో భారతీయ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ ఏడాది రెడ్ కార్పెట్‌పై నడవబోతున్న ప్రముఖ సెలబ్రిటీల వివరాలను పరిశీలిస్తే.. కాన్ వేడుకల అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్. రెండు దశాబ్దాలుగా ఈ వేదికపై మెరుస్తున్న ఆమె, ఈ ఏడాది కూడా తన స్టైలిష్ లుక్స్‌తో అలరించడానికి సిద్ధమవుతోంది.
గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆలియా భట్ ఈసారి కాన్ రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆమె ఫ్యాషన్ ఎంపికలపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో కాన్ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించిన దీపికా, ఈసారి కూడా అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రతినిధిగా హాజరయ్యే అవకాశం ఉంది. తన విలక్షణమైన ఫ్యాషన్ సెన్స్‌తో గుర్తింపు పొందిన షోభితా, ఈ ఏడాది కూడా రెడ్ కార్పెట్‌పై సందడి చేయనుంది.
వీరితో పాటు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ మరియు మృణాల్ ఠాకూర్ వంటి యువ తారలు కూడా ఈ వేడుకల్లో భాగం కానున్నట్లు సమాచారం. కేవలం రెడ్ కార్పెట్ మాత్రమే కాకుండా, పలు భారతీయ సినిమాలు కూడా ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ఇది భారతీయ సినిమా గ్లోబల్ గుర్తింపును మరింత పెంచనుంది.
Also Read:‘హిట్‌మ్యాన్’పై ప్రశంసల జల్లు!

