- Advertisement -
కరోనా ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. దక్షిణాఫ్రికాలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తుండగా కెనడాలో ఈ కేసుల సంఖ్య 15కు చేరాయి. కెనడాలో తొలికేసు గతనెల 28న నమోదుకాగా ప్రస్తుతానికి 15కు చేరాయి.
ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈనేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న 50 ఏండ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు నేషనల్ అడ్వైజరీ బోర్డు సూచించిందని వెల్లడించారు. ఆఫ్రికాతోసహా అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై కెనడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
- Advertisement -