కేటీఆర్‌ను కలిసిన కెనడా మంత్రి..

676
ktr
- Advertisement -

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావుని కెనడాలోని అల్ బెర్టా ఫ్రావిన్సు మౌళికవసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా ఈ రోజు కలిశారు. మంత్రి కేటీఆర్‌ నందినగర్ నివాసంలో కలసిన కెనడా మంత్రి, అల్బెర్టా ఫ్రావిన్సుతో తెలంగాణ మద్య వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. తెలంగాణలో ఐటి పరిశ్రమ రంగ అభివృద్ది గురించి చాల సానూకూల ఫీడ్ బ్యాక్ ఉన్నదని, ఈ రంగంలో అల్బెర్టా ప్రావిన్సులోని పారిశ్రామిక వర్గాల నుంచి ఆసక్తి వ్యక్తం అవుతుందని ప్రసాద్ పండా తెలిపారు. కెనడా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలున్నాయని, తెలంగాణ పారిశ్రామిక విధానాలు, అవకాశాల గురించి తెలిపేందుకు కెనడాలో పర్యటించాలని అహ్వనించారు.

అల్ బెర్టా ఫ్రావిన్సు ప్రీమియర్ జేసన్ కెన్నీ ని తెలంగాణలో పర్యటించాల్సిందిగా కోరామని, వచ్చే ఏడాది ఇక్కడకు అయన వస్తారని తెలిపారు. అల్బెర్టాలో తెలంగాణ రాష్ర్ట పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని పండా మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అనేక ఒడిదుడుకులు ఏదురైనా, ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి, అధికారంలోకి వచ్చిన తీరు పట్ల ముఖ్యమంత్రిపైన వ్యక్తిగతంగా ఏంతో గౌరవం ఉన్నదని ఈ సందర్భంగా పండా మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.

కెనడా దేశంలో సహజ వనరులు బలంగా ఉన్నాయని, భారత్ లో మానవ వనరులున్నాయని, ఈ రెండింటి కలయికతో మరిన్ని వ్యాపార అవకాశాలు ఏర్పడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న టియస్ ఐపాస్ వంటి పాలసీల ద్వారా ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలను తెలంగాణకు రప్పించిన తీరుపైన మంత్రి కేటీఆర్‌ వివరాలు అదించారు. ఈ సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారు విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గోన్నారు.

- Advertisement -