ఒలింపిక్స్‌ను బహిష్కరించిన కెనడా..

94
canada

ఒలింపిక్స్‌ను బహిష్కరించిన మరో దేశం జాబితాలో కెనడా చేరింది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌ను బహిష్కరించగా కెనడా కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. మానవ హక్కుల ఉల్లంఘన, చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని జస్టిన్‌ ట్రుడో ప్రకటించారు.

ఈ విషయాన్ని గత నాలుగు నెలలుగా పరిశీలిస్తున్నామని, తమ భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ట్రుడో తెలిపారు. వచ్చేడాది బీజింగ్‌లో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు వేడుకల్లో తమ దేశం తరఫున అధికారులు గానీ, రాయబారులు గానీ పాల్గొనరని చెప్పారు.

ఫ్రాన్స్‌ కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది. యూరోపియన్‌ దేశాలతో చర్చిస్తున్నామని ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు.