కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ …ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ క్యాష్-రిచ్ లీగ్‌లో గ్రీన్ తన 1,000 పరుగులను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.
లీగ్ దశలో భాగంగా శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన కీలక మ్యాచ్‌లో కామెరాన్ గ్రీన్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్.. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు.
కామెరాన్ గ్రీన్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి తన అద్భుతమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రిజ్ లోకి వస్తే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే ఈ హార్డ్-హిట్టర్, కేకేఆర్ జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. నిలకడైన ప్రదర్శనతో చాలా తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ 1000 పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం.
Also Read:నైట్ షిఫ్ట్‌లు..క్యాన్సర్ ముప్పా!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గ్రీన్ ఆడిన ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో కీలకంగా మారింది. ఐపీఎల్‌లో ఒక వైపు బంతితో వికెట్లు తీస్తూ, మరోవైపు బ్యాట్‌తో పరుగులు సాధిస్తూ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గ్రీన్ దూసుకుపోతున్నాడు.

