కాలీఫ్లవర్‌ తో బరువుకు చెక్..!

74
- Advertisement -

కాలీఫ్లవర్ ను ఎక్కువగా గోబిపువ్వు అని కూడా పిలుస్తుంటారు. దీనితో రకరకాల కర్రిస్, వేపుడు, వంటి రుచికరమైన వంటలు చేస్తుంటారు. ఇంకా ఈవినింగ్ టైమ్ లో చాలామంది ఎంతో ఇష్టంగా తినే గోబి మంచూరియా కూడా కాలీఫ్లవర్ తోనే తయారు చేస్తారు. అయితే కాలీఫ్లవర్ తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయని కొందరు చెబుతుంటారు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయని, కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందని, ఇంకా గ్యాస్ ట్రబుల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. ఇలాంటి కథనాలు చదువుతుంటాము. అయితే అలాంటి కథనాల్లో కొంత వాస్తవం కూడా లేకపోలేదు..

అధికంగా తీసుకుంటే అలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మితంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కాలీఫ్లవర్ వల్ల కలుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి కాలీఫ్లవర్ ఒక బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందట. ఎందుకంటే ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. దాంతో ఆహారం మితంగా తీసుకుంటాము ఫలితంగా సులువుగా బరువు తగ్గవచ్చు.

ఇంకా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా గుండెకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ కె మరియు కాల్షియం రక్త ప్రసరణను మెరుగు పరచడంతో పాటు ఎముకల దృఢత్వానికి ఉపయోగ పడతాయి. ఇక క్యాన్సర్ కరకాలను అడ్డుకునేందుకు క్యాలీఫ్లవర్ ఎంతగానో ఉపయోగ పడుతుందట. ఇందులో ఇండోల్ 3, కర్బినాల్, న్యూట్రియంట్లూ ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని దూరం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇంకా ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కాలీఫ్లవర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్ ను మితంగా తీసుకుంటే ఆరోగ్యమే అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఈ లక్షణాలు ఉంటే..కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే!

- Advertisement -