ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలకభేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి శుక్రవారం వరకు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది.
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు ఆర్టీసీ కార్మికులతో పాటు ఇటు రాష్ట్ర ప్రజలంతా ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? అనే విషయంపై అత్యంత ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీలో 50శాతం రూటు పర్మిట్లను ప్రైవేట్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా రూట్ల ప్రక్రియ ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో వీటిని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. పూర్తిగా గ్రామీణ మార్గాల్లోనే రూట్లను ప్రైవేట్ వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ రూట్ పర్మిట్లకు సంబంధించి ముందుగా నోటిఫికేషన్ జారీ చేసి వాటిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ జాప్యం జరిగే పక్షంలో తాత్కాలిక పర్మిట్లను జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Cabinet meeting will be held at Pragathi Bhavan here on November 28 at 2 p.m.A release said that the Cabinet meeting may extend to Friday.