నెలరోజుల పాటు ఉత్కంఠగా సాగిన మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. సీఎంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్కులో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఠాక్రే.
ఇక 20 ఏళ్ల తర్వాత శివసైనికుడు మహారాష్ట్ర సీఎం పదవిని చేపట్టబోతుండటంతో ఆ పార్టీ నేతలు ఆనందోత్సవాల్లో మునిగితెలుతున్నారు. చివరిగా శివసేనకు చెందిన నారాయణ్‌రాణే 1999లో సీఎం పదవినధిష్టించారు. అంతకుముందు 1995లో మనోహర్ జోషి శివసేనకు చెందిన తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
. మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతం మంది మాత్రమే మంత్రులుగా ఉండాలన్న నిబంధన మేరకు మహారాష్ట్రలో గరిష్ఠంగా 43 మంది వరకు మంత్రి పదవులను చేపట్టవచ్చు. అసెంబ్లీలో ప్రస్తుతం శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేనకు సీఎం పదవి సహా 15 మంత్రి పదవులు, ఎన్సీపీకి 15 ,కాంగ్రెస్‌కు 13 మంత్రి పదవులతోపాటు స్పీకర్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవి లభించనుండగా స్వాభిమానీ సంఘటన్ లేదా సమాజ్‌వాది పార్టీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Thackeray would be taking over as chief minister more than a month after results of the Maharashtra Assembly elections were declared on October 24.

