- Advertisement -
ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖారరైంది, రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ అంశాన్ని చర్చించారు. ఈ నెల 19న మంత్రివర్గ విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి మంచిరోజు కావడంతో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు చేశారు. 19న ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అయితే ఎంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారనేదానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఇదిఇలా ఉండగా ఫిబ్రవరి 22 నుండి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా 25న సభ అమోదం తెలపనుంది.
- Advertisement -