క్రికెట్ ఆస్ట్రేలియా..ప్రీ- సీజన్ ప్రారంభం.!

263
Cricket Australia
- Advertisement -

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల్లో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల చివరి వారం నుండి ప్రీ – సీజన్‌ను ప్రారంభించనుంది ఆసీస్.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్ పర్యవేక్షణలో శిక్షణను తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధించింది.

శిక్షణ సమయంలో బంతిని స్వింగ్ చేయడానికి లాలాజలం లేదా చెమటను ఉపయోగించడంపై నిషేధం విధించారు. దీంతో పాటు నెట్స్‌లో శారీరక దూరం ఉంటుంది… ప్రతి నెట్‌లో ఇద్దరు లేదా ముగ్గురు బౌలర్లు ఉంటారు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదని సీఎ అధికారులు తెలిపారు. మొత్తంగా ఆసీస్ తిరిగి ఆటను ప్రారంభిస్తే ఇదే బాటలో మిగితా దేశాలు నడుస్తాయో లేదా వేచిచూడాలి

- Advertisement -