పుష్ప…6 నిమిషాలకు 6 కోట్లు..!

502
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. అల వైకుంఠపురంలో తర్వాత బన్నీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టే ఇటీవల విడుదలైన బన్నీ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. సినిమాలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ ను 6 కోట్ల వ్యయంతో తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త టీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. పాన్ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీకి ఇది 20వ సినిమా.

- Advertisement -