కరెంట్ పోతుందని కంప్లైంట్లు ఇస్తే, తొండలు, ఉడుతలు వస్తున్నాయని అంటున్నారు అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..తొందర్లోనే స్టేషన్ ఘన్‌పూర్లో ఉప ఎన్నిక రాబోతోంది. తప్పకుండా రాజయ్య గెలుస్తారు అన్నారు.
మనం పాలించినప్పుడు మరి తొండలు, ఉడుతలు లేవా?,ఊసరవెల్లులు పరిపాలిస్తే ఇదే విధంగా పరిస్థితి ఉంటుందన్నారు. కేసీఆర్ పూర్తిచేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి, మేమే చేశామని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వాయర్లు కట్టింది, పంపులు పెట్టింది మనం. కానీ మనం చేసిన పనిని పక్కనపెట్టి, ఓన్లీ రిబ్బన్ కట్ చేస్తే ప్రాజెక్టు మేమే కట్టినట్టు కాంగ్రెస్ చెప్పుకుంటోందన్నారు.
ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ప్రజలు వాటిని గమనిస్తారు అన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు ముగ్గురు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అన్నారు. ఈ పీఆర్ స్టంట్లతో ప్రజలను ఎక్కువ రోజులు కన్‌ఫ్యూజ్ చేయలేరు అన్నారు. పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్టు రేవంత్ తీరు ఉందన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండేళ్ల క్రితం కాగ్నిజెంట్ సంస్థ తమ క్యాంపస్ విస్తరణకు ప్రణాళిక రూపొందించిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి అది తానే చేసినట్లు తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించాడన్నారు.
Also Read:Revanth Reddy:సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ ప్రారంభం