ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ యూస్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మొబైల్ మనలో ఒక భాగమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత పోన్ పాడైపోయినా లేదా కొత్త మొబైల్ కొనుకోవాలని భావించిన.. వెంటనే మొబైల్ షాప్ కు వెళ్ళి కొత్త ఫోన్ కొనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది కొత్త ఫోన్ కొనుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఫోన్ లోని ఎలాంటి ఫీచర్స్ తెలుసుకోకుండా నచ్చితే వెంటనే ఫోన్ కొనేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఫోన్ లో తగిన ఫీచర్స్ లేవని తెగ బాధ పడిపోతుంటారు. కాబట్టి ఏదైనా కొత్త ఫోన్ కొనుకునే ముందు కొన్ని సూచనలు తప్పక పాటించడం మచింది. అవేంటో తెలుసుకుందాం !
1. ప్రాసెసర్
మొబైల్ ఫోన్ లో ప్రధానంగా చూడవలసింది ప్రాసెసర్. ఎందుకంటే ప్రాసెసర్ ను బట్టి ఫోన్ పర్ఫామెన్స్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. స్నాప్ డ్రాగన్, మీడియా టెక్, శాంసంగ్ ఎగ్జినోస్, యూనికన్.. ఇలా చాలా రకాల ప్రాసెసర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మొబైల్ కు మనం వెచ్చించే బడ్జెట్ ను బట్టి ప్రాసెసర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ను బట్టి మీ బడ్జెట్ లో బెస్ట్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ను చూస్ చేసుకోవడం మంచిది.
2. కెమెరా
ప్రాసెసర్ తర్వాత మొబైల్ లో చూడవలసిన మరో ముఖ్యమైన విభాగం కెమెరా. కొంతమంది కేవలం కెమెరా కోసమే మొబైల్ కొనుకుంటూ ఉంటారు. అయితే మెగా పిక్సెల్ ఎక్కువగా ఉంటే కెమెరా క్వాలిటీ బాగుంటుందని భావిస్తారు కొందరు. అయితే నిజానికి మెగా పిక్సెల్స్ తక్కువగా ఉన్న మొబైల్స్ లో కూడా కెమెరా పనితనం బాగుంటుంది. కాబట్టి కెమెరానే మెయిన్ ప్రియారిటీగా ఎంచుకునేటప్పుడు బ్రాండ్ ను దృష్టిలో ఉంచుకొని మొబైల్ తీసుకోవాలి.
Also Read:ఇకపై TS కాదు TG..కేబినెట్ నిర్ణయాలివే
3. బ్యాటరీ
ప్రాసెసర్, కెమెరా తర్వాత మరో ముఖ్య విభాగం బ్యాటరీ. నేటి రోజుల్లో చాలా కంపెనీలు బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని మొబైల్ కంపెనీస్ 5000mh-6000mh బ్యాటరీ సామర్థ్యాన్ని ఇస్తున్నాయి. కాబట్టి బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండే మొబైల్ ను ఎంచుకోవడం మంచిది.
ఇంకా వీటితో పాటు డిస్ ప్లే, ర్యామ్, స్టోరేజ్.. వంటివి కూడా మొబైల్ తీసుకునేటప్పుడు తప్పకుండా చూడాలి. ఓవరాల్ గా మొబైల్ కు కేటాయించే బడ్జెట్ ను బట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని మంచి మొబైల్ కొనుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.