అల వైకుంఠపురములో.. ‘బుట్టబొమ్మా’ సాంగ్..

574
Ala Vaikunthapurramuloo
- Advertisement -

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా… నన్ను సుట్టుకొంటివే’ అన్న మరో సాంగ్ టీజర్ విడుదలైంది. ఇప్పటికే సినిమాలోని ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓ మైగాడ్ డాడీ’ పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా సాంగ్ ప్రోమో విడుదల కాగా, పూర్తి పాట 24న విడుదల కానుంది. ఈ సాంగ్ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయాండి.!

గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బ్యానర్లపై ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్.ఎస్ సంగీతం అందిస్తున్నారు.

https://youtu.be/8Z3DVP8DHUQ

- Advertisement -