మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు ఆమె భర్త నీలకంఠకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2018లో బుట్టా రేణుక దంపతులు సుమారు రూ.340 కోట్ల రుణాన్ని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. అయితే నిర్ణీత కాలవ్యవధిలో రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో పాటు వడ్డీలు పెరుగుతూ రావడంతో మొత్తం బాకీ మొత్తం భారీగా పెరిగింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి ఆ రుణం రూ.782.07 కోట్లకు చేరినట్లు సమాచారం.
పలు నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయిలు చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. రుణ వసూలు ప్రక్రియలో భాగంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన భూములు, భవనాలు తదితర ఆస్తులను వేలం ద్వారా విక్రయించి బాకీలు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వేలం తేదీలు, షరతులు తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
Also Read:Tomato:టమోటాతో ప్రయోజనాలు

