సాధారణంగా అప్పు తీర్చకపోతే ఆస్తి రాయించుకోవడమో.. లేదా బెదిరించడమో.. కొట్టడమో లాంటి ఘటనలు చూశాం. కానీ ఓ ఘటనలో అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని దారుణంగా బ్రతికుండగానే సమాధిలో పూడ్చిపెట్టారు.
ఈ ఘటన రష్యాలో జరిగింది. రష్యాకి చెందిన కిక్మెట్ అనే వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలవడంతో తీసుకున్న అప్పులు కట్టలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వాళ్లు కిక్మెట్ని చావగొట్టి సజీవ సమాధి చేశారు. అయితే సమాధి చేసిన సమయంలో అతని జేబులో ఫోన్ ఉండడంతో ఎలాగోలా తన సోదరుడు ఇస్మాయిల్‌కి ఫోన్ చేశాడు. అయితే కిక్మెట్ను సమాధి చేసిన ప్రదేశం తెలియలేదు. 1.2 మిలియన్ రూబుల్స్‌తో పాటు తన బీఎండబ్ల్యూ 535 మోడల్ కారును కూడా ఖిక్‌మెట్ బిజినెస్ పార్ట్నర్లకు ఇచ్చిన తరువాతే ఇస్మాయిల్‌కు సమాధి ఎక్కడుందో తెలిసింది.అప్పులవాళ్లకు ముందుగా అప్పు కట్టేసి సోదరుడిని పూడ్చిపెట్టిన సమాధి ఎక్కకుందో కనుక్కొని కిక్‌ను కాపాడుకున్నాడు.అప్పటికే కిక్మెట్ నాలుగు గంటల పాటు భూగర్భంలోనే ఉండడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే ఇస్మాయిల్ అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించాడు.