మోటారు వాహనాల సవరణ బిల్లు-2017కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికలోకం సమ్మెకు దిగింది. బస్సులు,లారీలు,ఆటోలు,క్యాబ్‌లు బంద్‌లో పాల్గొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లాల్సిన వారు అవస్థలు పడ్డారు. బస్సులు రోడ్డెక్కక పోవడంతో విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పలేదు .
హైదరాబాద్ లో సెట్విన్ బస్సులు మినహా మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వాహనాలూ తిరగడం లేదు. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర మహానగరాల్లోనూ ఇదే పరిస్థితి.
మోటారు వాహనాల బిల్లును ఉపసంహరించడంతో పాటు కనీస వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు డీజీల్, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కూడా వాహన యజమానులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.
బంద్‌కు రైల్వే కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఆర్గనైజేషన్ లేవనెత్తిన సమస్యలన్నీ సహేతుకుంగా ఉన్నాయని సీపీఎం పార్టీ అభిప్రాయపడింది.
Kerala: People face trouble in commuting as Kerala State Road Transport Corporation joint trade union committee is on a 24-hour token strike today against the proposed Road Safety and Transport Bill. Visuals from Thiruvananthapuram. pic.twitter.com/7oc7ezbjOi
— ANI (@ANI) August 7, 2018