బస్సులో మంటలు.. 45 మంది సజీవ దహనం..

78

యూరప్‌లోని బల్గేరియాలో యాత్రికుల బస్సు మంటల్లో చిక్కుకుకొని 45 మంది బలయ్యారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.

అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారే ఉన్నారు. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది.