చిల్లర కోసం తన్నుకుంటున్నారు…

229
bus-conductor-fight-with-passenger
- Advertisement -

రూపాయీ రూపాయీ నువ్ ఏం చేస్తావ్ అని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్దం ఆడిస్తాను…భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను..తండ్రీ బిడ్డల్ని విడదీస్తాను..అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులని కూడా విడగొడతాను అందట…ఈ సినిమాలోని డైలాగ్‌ను అందరు వినే ఉంటారు..డబ్బు మనిషిచేత ఏ పనైనా చేయిస్తుంది. ఇక ఇప్పటివరకు డబ్బుకోసం గొడవలు,తన్నులాటలు…చివరకు హత్యలు జరిగిన సందర్భాలున్నాయి. ఇదంతా డబ్బుకోసం…కానీ ఇప్పుడు డబ్బులున్నా చిన్నచిన్న గొడవలు తరచు జరుగుతునే ఉన్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక చిల్లర కోసం ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్తోంది పరిస్థితి. ఒకరికొకరికి పరిచయం లేదు…శత్రువులు కాదు..పాత పగతలు అంతకన్నా లేవు కానీ మాటమాట పెరిగి చివరకు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళుతున్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.

bus conductor fight with passenger

చిల్లర లేకపోవటంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కొంతమందైతే ప్రయాణాలు చేయటమే మానేస్తున్నారు. మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే…చిల్లర లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సందర్భంలో బస్సుల్లో కండక్టర్లతో గొడవలు జరుగుతున్నాయి. ప్రయాణికులు, కండక్టర్‌ దగ్గర చిల్లర లేకపోవటంతో ఒకరికొకరికి మాటామాట పెరిగి…..చివరకు గల్లలు పట్టుకునే వరకు వెళుతోంది. ఇంకొంతమందైతే….చివరకు తన్నుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు పెట్రోల్ బంకుల్లో కొకోల్లలు.

ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో సామాన్యులకు చిల్లర కష్టాలకు తోడు లేనిపోని శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో మోడీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సామాన్యుల కష్టాలు తీర్చేందుకు తగిన ఏర్పాట్లుచేయాలని సూచిస్తున్నారు. అయితే, సామాన్యులకు ఇప్పట్లో చిల్లర కష్టాలు తీరేలా కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పటివరకు గొడవలు జరిగి కొట్టుకునే వరకు వెళ్లినా….అక్కడికక్కడే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. కానీ రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితే ఉంటే…గొడవలు పెద్దవై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

- Advertisement -