బురదలోనే కమలం వికసిస్తుంది…

28
- Advertisement -

బీజేపీపై ఎంత బురద జల్లే ప్రయత్నాలు చేసిన కమలం పువ్వు బురదలో వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ధన్యావాద  తీర్మానంపై ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ వల్ల ఈ దేశం వెనుకబడిపోయిందన్నారు. విపక్షాల తీరు చూస్తుంటే చాల బాధేస్తుంది. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరమన్నారు.

ప్రజాసమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు ఆంశాలను ఊటంకిస్తూ…గత మూడు నాలుగేళ్లలోనే 11కోట్ల ఇళ్లకు తాగునీరు అందించామని అన్నారు. జన్‌ధన్ ఆధార్ మొబైల్‌ ట్రినిటి ద్వారా నేరుగా లబ్ధిదారులకు రూ.24లక్షల కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. కాంగ్రెస్ గత 4దశాబ్దాలకు పైగా గరీబి హఠావో నినాదంతోనే కాలం వెళ్లదీసింది. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకూ మేం సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు.

దేశం మా వెంట ఉంది. దేశ ప్రజలు మమ్మల్నే విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సామాజిక రాజకీయ విధానాలన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలపైనే ఆధారపడి ఉంటుందని మోదీ మండిపడ్డారు. ఆదివాసీల కోసం బడ్జెట్‌లో ఐదు రెట్ల నిధులు పెంచామని అన్నారు. కొవిడ్ కష్టకాలంలో కూడా టీకాలు అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలపైనా కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మన శాస్త్రవేత్తలు రూపొందించిన టీకాలే 150దేశాల ప్రజలను కాపాడాయని..ప్రతిపక్షాలు సైన్స్‌కు టెక్నాలజీకి వ్యతిరేకమన్నారు. దేశం గురించి వారికి బాధలేదు. వారికి ఎప్పుడూ రాజకీయాలే ముఖ్యమన్నారు. భారత్‌ రక్షణ రంగంలో ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు పైనే ఉన్నాయన్నారు. దేశ ఆత్మనిర్భరత సాధించే దిశగా పయనిస్తుందన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో ఆర్టికల్ 356ఉపయోగించి అధికార దుర్వినియోగంకు పాల్పడిన వ్యక్తిగా ఇందిరా గాంధీ చరిత్రలో నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలకులు 600లకు పైగా పథకాలకు గాంధీ, నెహ్రూ పేరు పెట్టారు (గతంలో ఇదే ఆంశంపై కథనం వెలువడింది) గాంధీ పేరు ఉన్న నేతలు తమ ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదు అని ప్రశ్నించారు.  వెల్‌లోకి దూసుకొచ్చిన పలువురు ఎంపీలు నిరసన తెలిపారు.  అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై జేపీసీ వేయాలని దర్యాప్తు జరిపించాలంటూ నినాదాలు చేశారు. అయిన మోదీ వారి మధ్యనే ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇవి కూడా చదవండి…

సచివాలయ ప్రారంభోత్సవంపై మంత్రి…

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

- Advertisement -