- Advertisement -
పైరసీ చేయకండి.. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోకండని యువతకు నిర్మాత బన్నీ వాసు వార్నింగ్ ఇచ్చారు. గీతా గోవిందం అప్పుడు చాలా మంది తెలియక పైరసీ చేశారు కానీ, క్రిమినల్ కేసు ఫైల్ అయ్యాక ఎవరూ ఏం చేయలేరు అని చెప్పారు.
యువకులకు చెబుతున్నా.. పైరసీ కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్తు పాడు చేసుకోకండని తెలిపారు బన్నీ వాసు. IP అడ్రస్ ట్రాక్ చేయడం పోలీసులకు పెద్ద కష్టం కాదు అన్నారు.
RTC బస్సులో సినిమాను వేయడమేంటి? అని ప్రశ్నించారు. దీన్ని మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. ఇకపై పైరసీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read:మోడీ అధ్యక్షతన AI సమావేశం
- Advertisement -

