- Advertisement -
పర్సెంటేజ్ కాదు.. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాలి అని కీలక కామెంట్స్ చేశారు నిర్మాత బన్నీ వాసు. అర్థ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు అన్నారు.
మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి అని సూచించారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే నాలుగైదు ఏళ్లల్లో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి అన్నారు.
రెండేళ్లు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు దూరం అవుతారు అని… ఈ విషయాన్ని బడా హీరోలు గ్రహించాలి అన్నారు.
Also Read:Kannappa:కన్నప్పలో రజనీకాంత్!
- Advertisement -

