బన్నీ , సుక్కు మాటిచ్చేశారు

196
- Advertisement -

అల్లు అర్జున్ , సుకుమార్ కలిసి పుష్ప 2 షూటింగ్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ నిఖిల్ ’18 పేజిస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో తలోకరికి మాటిచ్చేశారు. ముందుగా సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ గురించి చెప్తూ రంగస్థలం సినిమాకు ముందు హీరోయిన్ అనుపమ నే. షూటింగ్ లో అస్తమాట్లు అమ్మ అంటూ పక్కన చూస్తుంటే భయం వేసి వద్దనుకున్నాం. కానీ తను చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. త్వరలోనే తనతో ఓ సినిమా చేస్తాను అంటూ మాటిచ్చాడు.

ఇక అల్లు అర్జున్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ కి మాటిచ్చాడు. మీ మ్యూజిక్ బాగుంటుంది. త్వరలోనే కలిసి వర్క్ చేద్దాం అంటూ చెప్పుకున్నాడు. గీతా ఆర్ట్స్ లో గోపి సుందర్ వర్క్ చేసిన సినిమాల ఆల్బమ్స్ పెద్ద హిట్స్. గీత గోవిందం ఆల్బం విన్న వెంటనే బన్నీ గోపీ సుందర్ మ్యూజిక్ కి ఫిదా అయిపోయాడు. ఇప్పుడు 18 పేజిస్ సాంగ్స్ విని అతన్ని మరోసారి వేదికపై అభినందించాడు.

మరి ఇద్దరూ కలిసి తలోకరికి 18 పేజిస్ ఈవెంట్ వేదికగా మాటిచ్చారు. మరి బన్నీ గోపి సుందర్ కి చాన్స్ ఇస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుగులో చాలా హెల్ప్ అవుతుంది. బన్నీ అవకాశం ఇస్తే గోపి సుందర్ టాప్ లిస్టులో చేరతాడు. అలాగే అనుపమ కూడా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తుంది. సుకుమార్ అవకాశం ఇస్తే తను కూడా టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరడం ఖాయం. మరి ఇచ్చిన మాట ఈ ఇద్దరు నిలబెట్టుకొని ఇద్దరినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

నాగ్ దగ్గరకు బాలయ్య కథ

అందాలను చూపి…18 లక్షలు కొట్టేసింది..

వారసుడు…ఇట్స్ ఫర్‌యూ అమ్మా సాంగ్‌

- Advertisement -