డీజే కోసం కష్టపడుతున్న బన్నీ

196
Bunny prepares for DJ Duvvada Jagannadham
- Advertisement -

సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా ఆసక్తి పెరిగిపోతోంది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గబ్బర్ సింగ్ ఫేమ్ హరిష్ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నిన్న తెల్లవారు జాము 2 గంటల వరకూ అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇకపై గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ఆఖరులో మొదలైన ఈ చిత్ర షూటింగ్‌ బన్నీకి కూతురు పుట్టడం, చిరు 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ విడుదల, సంక్రాంతి పండుగ వంటి కారణాల వలన ఆలస్యయింది.

దాన్ని కవర్‌ చేసి అనుకున్న సమయానికే సినిమాను పూర్తిచేయాలని బన్నీ టీమ్‌ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతోంది. అర్థరాత్రి 2 గంటల వరకు షూటింగ్‌ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇకపై కూడా ఇలాగే బిజీ షెడ్యూల్స్‌ జరుగుతాయని తెలుస్తోంది. ఈ సినిమాను వేసవికి రిలీజ్‌ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. సినిమా విడుదల తేదీపై ఆలస్యం ప్రభావం చూపకుండా వుండటం కోసం, టైట్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. సరైనోడు సినిమాలో ఫిట్‌గా స్టైలిష్‌గా కనిపించిన బన్నీ ఈ సినిమా కోసం సరికొత్త హెయిర్‌ స్టైల్‌లో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -