బన్నీకి బెస్ట్ విషెస్ ఇవే

51
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈరోజు అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు ఆయన అభిమానులు బన్నీ ఇంటికి చేరుకున్నారు. తన కోసం ఇంటివద్దకు వచ్చిన అభిమానులను కలిసేందుకు బన్నీ బయటకు వచ్చి.. వారిని ఆప్యాయంగా పలకించారు. బన్నీతో పాటు.. ఆయన కూతురు అల్లు అర్హ.. కుమారుడు అయాన్ సైతం బయటకు వచ్చి సందడి చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అన్నట్టు బన్నీకి సినీ ప్రముఖులు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా బన్నీ కి డేవిడ్ వార్నర్ బర్త్ డే విషెస్ చెప్పాడు. వార్నర్ తన కుమార్తె ఐలా తో కలిసి చెప్పిన విషెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ తన కూతురుతో కలిసి ఒక వీడియో షేర్ చేశాడు. బిగ్ షాట్ అవుట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్ డే.. పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ బర్త్ డే నీకు చాలా గొప్పగా ఉండాలి అంటూ పుష్పరాజ్ కు వార్నర్ విషెస్ చెప్పాడు.

ఇక పుష్ప 2 మూవీ నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అమ్మోరును అలంకరిస్తే ఎలా ఉంటుందో బన్నీ లుక్ కూడా అలాగే ఉంది. అమ్మోరు వేషధారణలో బన్నీ ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ లుక్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇవి కూడా చదవండి…

OTT:ఆ చిత్రాలు అప్పుడే ఓటీటీలోకి

ఏప్రిల్ 15న కమెడియన్ సూరి సినిమా విడుదల..

రుద్రుడు..థియేట్రికల్ ట్రైలర్

- Advertisement -