ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్‌లోకి రానున్న సంగతి తెలిసిందే. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ప్లేస్ లో నిర్మించిన మల్టీప్లెక్స్ లో ఏషియన్ అల్లు అర్జున్ మాల్ ను ఏర్పాటు చేశాడు. ‘ఆదిపురుష్’ జూన్ 16న రిలీజ్ కానుండగా.. అదేరోజు మల్టీప్లెక్స్‌ను ప్రారంభిస్తారట. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్‌బాబు – ‘AMB’ మాల్, విజయ్ దేవరకొండ – AVD మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఇదే క్రమంలో బన్నీ కూడా మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు.
మొత్తానికి అల్లు అర్జున్ నటనలోనే కాదు, తనకు బిజినెస్ లోనూ మంచి విషయం ఉందని నిరూపించబోతున్నాడు. బిజినెస్ లో ఎక్కడ ఎలా ఎదగాలో అల్లు అరవింద్ కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే, అల్లు అరవింద్ ఓటటీలో కూడా రాణించాడు అని చాలా మంది నమ్మకం. ఐతే, ఆయన కుమారుడు అల్లు అర్జున్ మాత్రం ఇన్నాళ్లు బిజినెస్ వ్యవహారాలకి దూరంగా ఉన్నాడు. కానీ, తనకంటూ ప్రత్యేక బిజినెస్ ఉండాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు బిజినెస్ లోనూ అడుగు పెట్టాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు.
Also Read: ‘నేను స్టూడెంట్ సర్’ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది..
ఏషియన్ వాళ్ళతో కలిసి ఓ థియేటర్ నిర్మాణానికి బన్నీ పూనుకున్నాడు. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఓ స్టూడియో నిర్మాణాన్ని కూడా బన్నీ చేపట్టనున్నాడు. మరి ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది. ఐతే, బిజినెస్ లో బన్నీ ఎంట్రీ అనేది ఆల్ మోస్ట్ ఖరారు అయినట్టే. ఇప్పటికే అల్లు అర్జున్ రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు.
Also Read: Project-k:కీలక పాత్రలో స్టార్ హీరో..!