CMKCR:పేద బ్రహ్మణులకు గుడ్‌న్యూస్‌

37
- Advertisement -

పేద బ్రహ్మణులకు శుభవార్త తెలిపారు సీఎం కేసీఆర్. రంగారెడ్డి జిల్లాలోని గోపన్‌పల్లిలో రూ.12కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రహ్మణ సదన్‌ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద బ్రహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకంను తీసుకొస్తామని హామినిచ్చారు. బ్రహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 12నిర్మాణలను చేపట్టారు. దీనికి జూన్‌5న 2017న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కళ్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి. ఇక్కడ భక్తి ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా సేవలందించే విధంగా ఈ భవనంను తీర్చిదిద్దారు. బ్రహ్మణుల సర్వతోముఖాభివృద్ధికి 18మంది సభ్యులతో కూడిన తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి కేవీ రమణాచారి సారథ్యం వహించనున్నారు. ఈ పరిషత్తు బ్రహ్మణుల సంక్షేమానికి పథకాలను అమలు చేయనుంది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. బ్రహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేదబ్రహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకోస్తామని అన్నారు. బ్రహ్మణ సదనం భవనానన్ని రూ.12కోట్లతో నిర్మించామని తెలిపారు. ఈ బ్రహ్మణ సదన్ వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా వెలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వేద పండితుల భృతిని రూ.2500 నుంచి రూ.5000వరకు పెంచామని అన్నారు. దూపదీప నైవేధ్యాల కింద ఇచ్చే నిధిని రూ.10వేలు పెంచామని అన్నారు. బ్రహ్మణుల గౌరవ భృతి అర్హత వయసు 75 నుంచి 65యేళ్లకు తగ్గించామని అన్నారు.

Also Read: MP Santhosh:బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ రంజీత్‌రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కేవీ రమణాచారి, రాజీవ్‌శర్మ, శృంగేరి, కంచి పీఠాధిపతులు, విప్రవరులు, బ్రహ్మణోత్తములు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి వచ్చిన పండితులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: CM KCR:బ్రహ్మణులకు వరాల జల్లు

- Advertisement -