అల్లు అర్జున్ తో ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’ సినిమాని తెరకెక్కించడానికి కసరత్తులు చేస్తున్నాడు. షూటింగ్ స్పీడ్ గా ఫినిష్ చేసే ప్లాన్ ఉంది. అంటే వచ్చే ఏడాది మధ్యలో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేయాలని సుకుమార్ టార్గెట్. అయితే, సుకుమార్ అక్కడక్కడా చిట్‌చాట్‌లలో ఆఫ్ దిరికార్డ్‌గా బన్నీ తో తీస్తున్న ‘పుష్ప 2’ ప్యూర్ తెలుగు సినిమాతో పాటు ప్యూర్ హిందీ సినిమా’ అని కూడా అన్నాడని హిందీ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. సో గుడ్… ఇతర భాషలో అల్లు అర్జున్ డైరెక్ట్ సినిమా చేస్తే.. బన్నీ ఫ్యాన్స్ కి అంతకన్నా కావల్సింది ఏముంది..?. పైగా అల్లు అర్జున్ కి హిందీలో డైరెక్ట్ రోల్ చేయడం ఈజీనే. గత కొన్ని నెలలుగా బన్నీ హిందీ భాష పై పట్టు సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇప్పటికే బన్నీకి హిందీలో ఫ్లూయెన్సీ వచ్చిందని టాక్ ఉంది.
ఎలాగూ గతంలో అల్లు అర్జున్ చేసిన కొన్ని హిందీ యాడ్స్ కి డబ్బింగ్ తనే స్వయంగా చెప్పుకున్నాడు. సో, అల్లు అర్జున్ డైరెక్ట్ హిందీ సినిమా చేయడంలో వింత ఏమీ లేదు. కాకపోతే.. పుష్ప 2 సినిమా అనేసరికి హిందీ ప్రేక్షకుల్లో.. పుష్ప రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి.. పుష్ప సినిమా లాగే తెలుగులో తీసి, హిందీలో డబ్బింగ్ చెప్పిస్తే సరిపోదు. కచ్చితంగా ‘పుష్ప 2’కి హిందీలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వాలంటే.. చాలా సమస్యలున్నాయి. సుకుమార్ కి హిందీ రాదు. బన్నీకి కూడా మొదటి నుంచి హిందీ పై మమకారం లేదు. పుష్పకి వచ్చిన ఆదరణను బట్టి బన్నీ ప్రేమను పెంచుకున్నాడు.
సో, సుకుమార్ – బన్నీ ఎంతవరకు హిందీని ఓన్ చేసుకుంటారు..? చేసుకున్నా ఆ సహజత్వం ఎంతవరకు వస్తోంది ?, అదే ఇక్కడ కీలకం. దీనికితోడు మళ్లీ తెలుగు మార్కెట్ మీదే బన్నీ ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాంటప్పుడు హిందీలో డైరెక్ట్ సినిమా కోసం ఎందుకు నెలల సమయం ఖర్చు చేయాలి ?, దీనికితోడు గతంలో రామ్ చరణ్ డైరెక్ట్ హిందీ సినిమా చేస్తే.. తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. దాంతో ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు బన్నీ విషయంలోనూ ఆ ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. అందుకే.. బన్నీ హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా.. తెలుగుకి అంతకు మించిన ప్రాధాన్యత ఇవ్వాలి. మరీ ఇవ్వడానికి అల్లు అర్జున్ దగ్గర ఆ సమయం ఉందా ?, ఎంత లేదన్నా ‘పుష్ప 2’కి తెలుగులోనే ఎక్కువ మార్కెట్ అవుతుంది.. బన్నీ అది మర్చిపోకూడదు.
ఇవి కూడా చదవండి…