‘పుష్ప’ కోసం బన్నీ భారీ యాక్షన్‌..

245
puspha

సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ కొంత కేరళ అడవుల్లో జరిగింది. ఇప్పుడు మళ్లీ షూటింగుకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా షూటింగుకి రెడీ అవుతున్నాడు. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఈ చిత్రకథ విషయానికొస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగేది కావడంతో అడవుల్లోనే ఎక్కువ షూటింగ్ చేయాల్సివుంది. అందుకే ఈసారి మొదలెట్టే షెడ్యూలును కూడా అడవుల్లోనే చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం కేరళ కానీ, రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి అడవులకు కానీ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ముందుగా బన్నీ, ఫైటర్లు పాల్గొనే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన రిహార్సల్స్ ను హైదరాబాదులో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి షూటింగుకి వెళతారని సమాచారం.