వైభవంగా బడ్జెట్ కార్ ప్రీమియమ్ మొదటి వార్షికోత్సవం

333
cars
- Advertisement -

బడ్జెట్ కార్ ప్రీమియమ్ మొదటి వార్షికోత్సవ సంబరాలు హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆటోమొబైల్ ప్రపంచంలో కార్లు కొనడం, అమ్మడంలో విజయవంతంగా దూసుకెళుతూ, మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఫౌండర్ ఛైర్మన్ సయ్యద్ రెహన్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బడ్జెట్ కార్ ప్రీమియమ్ ఫౌండర్ ఛైర్మన్ సయ్యద్ రెహన్ మాట్లాడుతూ.. ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాజరైన ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు. మా సంస్థ విజయవంతంగా ఫస్ట్ యానివర్శిరీ‌ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిది. టీమ్ అందరి సపోర్ట్, ఆ దేవుని దయ వల్ల మేము చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ విజయవంతమైంది. మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చనా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఈ రోజు ఇలా నిలబడ్డాము.

రెండు ఫ్లోర్లలో సుమారు 40 నుంచి 50 వరకు ప్రీమియమ్, సూపర్ ప్రీమియర్ కార్లను మెయింటైన్ చేసే స్థాయిలో ఉన్నాం. కార్లు కొనడం, అమ్మడం అన్నీ విషయాలలో ప్రజలకు బడ్జెట్‌లో కార్లను అందిస్తూ.. విజయవంతం అయ్యాం. ప్రస్తుతం మావి రెండు బ్రాంచ్‌లున్నాయి. మరో కంపెనీ కూడా రెడీ అవుతుంది. ఇలా సిటీలో ఎన్నో బ్రాంచ్‌లను నెలకొల్పాలనే ధ్యేయంతో ముందుకు వెళుతున్నాం. ఒక్క ఈ సిటీలోనే కాదు వరల్డ్ వైడ్‌గా మా బ్రాంచ్‌లు స్థాపిస్తాం. ఎంతో అంకితభావం కలిగిన స్టాఫ్ ఈ బడ్జెట్ కార్ ప్రీమియమ్‌లో ఉన్నారు. ముందు ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటామని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మా కస్టమర్లకు, మా టీమ్‌కు, డీలర్లకు, సహకరించిన వారికి, మీడియాకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని అని అన్నారు.

- Advertisement -