- Advertisement -
మున్సిపల్ ఎన్నికల కేళ ఏపీ టీడీపీలో ముసలం నెలకొంది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేతను ప్రకటించడంతో వ్యతిరేకవర్గం భగ్గుమంది. నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.
టీడీపీ అధినేత చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడిన నానిని ఆ రోజే చెప్పుతో కొట్టాలి అనుకున్నానని…రంగాను చంపిన కేసులో ముద్దాయిలను వెంట పెట్టుకుని నాని తిరుగుతున్నాడని నిప్పులు చెరిగారు. నానివి కులం పోకడలు..పార్టీకి నష్టమని పేర్కొన్నారు.
2024 లో తానే ఎంపీగా పోటీ చేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. కేశినేని నాని రెండు కాళ్ళు ఇరగ్గొడతానని…తన వెనుక ఉన్న ఒక్క మనిషిని పంపితే చాలు….నాని పని అయిపోతుందని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. నాని ఉంటే ఎన్నికల్లో పని చేయలేమని తెలిపారు.
- Advertisement -