- Advertisement -
నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనుండగా తొలి విడతగా నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు,రెండవ విడతగా మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా కోవిడ్-19 నిబంధనలకనుగుణంగా, భౌతికదూరం పాటిస్తూ ఉభయ సభలలో కూర్చుని రాష్ట్రపతి ప్రసంగం వింటారు.
లోకసభ టి.వి, రాజ్యసభ టి.విలకు చెందిన మొత్తం 30 కెమేరాలను రాష్ట్రపతి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కోసం వినియోగిస్తున్నారు. ఒక్క సెంట్రల్ హాల్ లోనే 9 కెమేరాలను వినియోగిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
- Advertisement -