బడ్జెట్‌ మధ్యలో నవ్వించిన నిర్మలా..

20
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ వరసగా ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న …. ఆరో మంత్రిగా రికార్డులకెక్కింది. ఈ సారి బడ్జెట్‌ను సామాన్య ప్రజలకు ఊపిరి తీసుకునే విధంగా ఉందని స్వపక్షం అంటూండగా….విపక్షం మాత్రం ద్రవ్యోల్భణం, నిరుద్యోగిత, ఎంజీనరేగా వంటి వాటిని విస్మరించిన బడ్జెట్‌ అని అంటున్నారు. కాగా నేడు బడ్జెట్ ప్రసంగంలో పొరపాటున ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా మాట్లాడటం వల్ల సభలోని సభ్యులందరూ కాసేపు నవ్వుకొని సేద తీరారు.

వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ప్రకటిస్తూ…ఓల్డ్ పొల్యుటింగ్ వెహికిల్‌ను రిప్లేస్ చేస్తున్నామని చెప్పే సమయంలో…ఓల్డ్‌ పొలిటికల్‌ అని పలికారు. దీంతో వెంటనే సారీ చెబుతూ…ఓల్డ్ పొల్యుటింగ్ వెహికిల్స్‌ అని పలికారు. సభలోని సభ్యలందరూ ఒక్కసారిగా నవ్వారు. అయితే వెహికిల్‌ రిప్లేస్‌మెంట్ పాలసీ అతిముఖ్యమైన విధానమని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్నికి సంబంధించిన చట్టాన్ని గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ చట్టం అమలుల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వ రంగంలో ఉన్న పాత వెహికిల్స్‌ సూమారుగా 40లక్షల వరకు తుక్కుగా మారనుంది. దీంతో పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా వెహికిల్‌ స్క్రాపింగ్ విధానంను చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలైట్స్

దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు..

7 లక్షల వరకు నో ట్యాక్స్‌..

- Advertisement -