మోడీ సర్కార్ ‘చివరి బడ్జెట్’..అవుతుందా?

27
- Advertisement -

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టి నెలకొంది. అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వనుంది? విపక్షాలు కేంద్రాన్ని ఎలా ఇరకాటంలో పెట్టబోతున్నాయి? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇదే చివరి బడ్జెట్.. వచ్చే పార్లమెంటు సమావేశాలు నాటికి కొత్త ప్రభుత్వం కొత్త సభ్యులు కొలువు తీరే అవకాశం ఉంది. దీంతో ఈ తాత్కాలిక బడ్జెట్లో మోడీ ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు జరుపుతుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.

ఇక గడిచిన పదేళ్లలో మోడీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు అటువైపు విపక్షాలు కూడా అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు కావడంతో ఈ సమావేశాల్లో మోడీ సర్కార్ ను ఇరుకున పెడితే ఎన్నికల్లో మైలేజ్ లభిస్తుందని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అక్రమ కేసులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ అల్లర్లు.. ఇలా చాలా అంశాలను మోడీ సర్కార్ పై ఎక్కు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి విపక్షాలు. ఇటు బీజేపీ కూడా విపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూ ప్రజాదృష్టిని ఆకర్షించేందుకు బడ్జెట్ కేటాయింపులు, ఇతరత్రా హామీలు ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మోడీ ప్రభుత్వం చేపడుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు కావడంతో వాడి వేడి చర్చలతో సభ హోరెత్తిపోయే అవకాశం ఉంది.

Also Read:పచ్చిమిర్చి తింటే మేలే.. కానీ జాగ్రత్త!

- Advertisement -