Budget 2024: వ్యక్తిగత పన్ను మినహాయింపు ఉంటుందా?

21
- Advertisement -

ఎన్నికల ముందు కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే బడ్జెట్ కావడంతో భారీ తాయిలాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆదాయపు పన్ను మినహాయింపు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు, దీర్ఘకాలిక పన్ను విధానం, వినియోగం, పొదుపు ప్రోత్సహించడం, వ్యవసాయానికి రాయితీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఆదాయ పరిమితిని 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచే ఛాన్స్ ఉంది.

ఎంఎస్ఎంఈలు దేశ జీడీపీ, ఉపాధి కల్పనకు పట్టుగొమ్మలని, ఇలాంటి వాటిని ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించడంలో భాగంగా పన్ను మినహాయింపు, ప్రసూతి సెలవులు అందించాలనే వాదన వినిపిస్తోంది.

Also Read:చికెన్ లివర్.. తింటే ఏమౌతుంది?

- Advertisement -